హరీష్ రావు, విజయ్ దేవరకొండ సిద్దిపేటలో సందడి!
మాజీ మంత్రి హరీష్ రావు, హీరో విజయ్ దేవరకొండ కలిసి సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను విజిట్ చేశారు. హాస్పిటల్‌లోని చిన్న పిల్లల హార్ట్ సర్జరీ వార్డులను పరిశీలించి, అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న పిల్లల హెల్త్ కండిషన్ గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. హరీష్ రావు, విజయ్ దేవరకొండలను ఒకేసారి చూసేసరికి అక్కడ ఉన్నవాళ్లంతా ఫుల్ ఖుషీ అయ్యారు.



