చేతులు, మెడకు తాళ్లు కట్టి..!
ఏపీ.. విజయనగరం జిల్లాలోని భోగాపురంలో దారుణం జరిగింది. మహేష్ అనే మెకానిక్.. ఓ యువకుడి చేతులు, మెడకు తాళ్లు కట్టి నడిరోడ్డుపై నడిపించి, తర్వాత బైక్‌తో లాక్కెళ్లడం తీవ్ర కలకలం రేపింది. బైక్ రిపేర్ డబ్బులు ఇవ్వలేదనే కారణంతో మెకానిక్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన పోలీసులు.. మెకానిక్ మహేశ్‌తో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిని అరెస్ట్ చేశారు.



