← Back to news

నదిని శుభ్రం చేసిన బిట్టూకు.. విదేశీ జాబ్ ఆఫర్!

By Nani Garikina· 3h ago
నదిని శుభ్రం చేసిన బిట్టూకు..  విదేశీ జాబ్ ఆఫర్!

ఒక నదిని శుభ్రం చేయడానికి మొదలైన పని.. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ జాబ్‌ ఆఫర్‌గా మారింది! మధ్యప్రదేశ్‌కు చెందిన సురేంద్ర సింగ్ చౌదరి, సోషల్ మీడియాలో ‘బిట్టూ తబాహీ’గా గుర్తింపు పొందారు. నెలల పాటు అజ్నార్ నదిలోని ప్లాస్టిక్, చెత్త, ఇతర వ్యర్థాలను స్వయంగా తొలగించడంతో ఆయన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ పని ది ఓషియన్ క్లీనప్ ఫౌండర్, CEO బోయన్ స్లాట్ దృష్టికి వెళ్లింది. ఆయన Xలో బిట్టూను తమ సంస్థలో చేరాలని నేరుగా ఆహ్వానించారు. ఇప్పుడు ఈ ఆఫర్‌ను బిట్టూ స్వీకరిస్తారా అన్నదే ఆసక్తికరంగా మారింది.

More in National