నాగార్జునకు 'సీడ్ గణేశ్'

TG: టాలీవుడ్ యాక్టర్ నాగార్జున.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'సీడ్ గణేశ్' ప్రతిమను స్వీకరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రోగ్రాం ప్రారంభించిన రాజ్యసభ ఎక్స్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌కి ఆయన థాంక్స్ చెప్పారు. "ఇది ఎంతో చక్కటి ఆలోచన.. సీడ్ గణేశ్ విగ్రహం నుంచి ఒక పచ్చని మొక్క ప్రాణం పోసుకుంటుంది. అందరం సీడ్ గణేశ్‌ను మాత్రమే ఎంచుకుందాం" అని నాగార్జున అన్నారు. మీరు కూడా మీ ఊరి మట్టి లేదా సీడ్ గణేశ్‌తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.


