← Back to news

ఈడీ కేసులో కారుమూరి సంచలన ఆరోపణలు!

By Mahesh· 24 Aug 2026· AP
ఈడీ కేసులో కారుమూరి సంచలన ఆరోపణలు!

AP: మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌లో ఈరోజు మెడికల్ టెస్టులు చేశారు. నిన్న కొండాపూర్‌లోని అయన ఇంట్లో ED అధికారులు అరెస్ట్ చేశారు. మెడికల్ టెస్టుల తరువాత నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లనున్నారు. ఇదే కేసులో ఆయన కొడుకు సునీల్‌ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. తన అకౌంట్‌లో ఎలాంటి డబ్బులు క్రెడిట్ కాలేదని కారుమూరి తెలిపారు. సుదర్శన్ కన్‌స్ట్రక్షన్ నుంచి తనకు డబ్బులు వచ్చాయన్న ఆరోపణలు నిజం కాదని స్పష్టం చేశారు. కేసులో నిజానిజాలు కోర్టులో తేలుతాయని మీడియాతో అన్నారు.

More in AP