డాగ్స్‌కి మన మాటలు అర్థమవుతాయా?

మనుషులు మాట్లాడే మాటలను కుక్కలు కూడా గుర్తించగలవని తాజా స్టడీ చెబుతోంది. హంగరీలోని Eotvos Lorand University పరిశోధకులు 20 మంది మనుషులు, 20 కుక్కలపై ఈ study చేశారు. 3 అక్షరాల మాటలను వినిపించి Electroencephalogramతో బ్రెయిన్ స్పందనలను పరిశీలించారు. హల్లుల ఆధారంగా పదాలను గుర్తించే సమయంలో కుక్కల మెదడులోనూ మనుషుల లాగానే స్పందనలు కనిపించాయి. దీంతో మాటలను గుర్తించే సామర్థ్యం మనుషులకే పరిమితం కాకపోవచ్చని పరిశోధకులు తెలిపారు.



