చిన్న సినిమాలకు ప్రిఫెరెన్సు ఇవ్వట్లేదు.. లగడపాటి

చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టంగా మారిందని ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ అన్నారు. ‘అనకాపల్లి’ సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ.. ఒకేసారి దాదాపు 20 సినిమాలు రిలీజ్ కావడంతో థియేటర్ల విషయంలో ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. పెద్ద బ్యానర్ల సినిమాలకు ఎక్కువ ప్రిఫెరెన్సు దక్కిందన్నారు. మొదటి రెండు రోజులు ఇబ్బందులు ఎదురైనా ‘అనకాపల్లి’ ఆడియన్స్ రెస్పాన్స్‌తో పుంజుకుందని, మూడో రోజు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు.



