డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం

ఢిల్లీకి చెందిన 69 ఏళ్ల రిటైర్డ్ శాస్త్రవేత్త ప్రదీప్ కుమార్ దాస్‌ను సైబర్ మోసగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో 1.25 కోట్లు మోసం చేశారు. ఢిల్లీ పోలీసులమని, 'National Investigation Agency' అధికారులమని చెప్పి, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తామని బెదిరించారు. డబ్బుల వివరాలు తనిఖీ చేయాలంటూ మూడు బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయించారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు విదేశాల్లో ఉన్నవారితో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

