ఢిల్లీలో దారుణం: సైకిల్ ట్రాక్‌పై స్కూటర్లు!
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఢిల్లీలో పిల్లలు, సైక్లిస్టుల కోసం కేటాయించిన స్పెషల్ గ్రీన్ సైకిల్ ట్రాక్‌పై కొందరు స్కూటర్లతో రైడింగ్ చేస్తూ కనిపించారు. అక్కడ చిన్న పిల్లలు సైకిల్ తొక్కుతున్నా పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశారు. వీడియో తీస్తున్న వ్యక్తి ప్రశ్నించినా.. ఏమాత్రం గిల్ట్ లేకుండా కేజువల్‌గా వెళ్ళిపోయారు. ఈ ట్రాఫిక్ రూల్స్ బ్రేకింగ్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



