← Back to news

ఎస్పీ కార్యాలయంలో ఆయుధ పూజ

By J Krishna· 1d ago· Nagarkurnool
ఎస్పీ కార్యాలయంలో ఆయుధ పూజ

నాగర్ కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో ఇవాళ దుర్గాష్టమి సందర్భంగా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఆయుధ పూజ నిర్వహించారు. పోలీసుల ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలకు, పోలీసు అధికారులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

More in Local