ఆ మట్టి తవ్వకం అ్రకమం..

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పుట్టినిగూడ పంచాయతీ, సంగెం రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 206లో 8.20 గుంతల ప్రభుత్వ భూమిలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. జనసేన నాయకులు జార్పుల రాజునాయక్ ఆధ్వర్యంలో సభ్యులు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. అక్రమ తవ్వకాలు వెంటనే ఆపాలని, మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జంగా శేఖర్, పట్నం కుమార్, రాజు యాదవ్, పట్నం రాజు పాల్గొన్నారు.



