AI కంటెంట్‌పై కంగనా పిటిషన్

నటి, బీజేపీ MP కంగనా రనౌత్ తనపై సోషల్ మీడియాలో వస్తున్న అశ్లీల, అసభ్యకర పోస్టులు, AIతో చేసిన డూప్లికేట్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టులో ఈ రోజు పిటిషన్ వేశారు. ఈ కంటెంట్‌ను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆమె కోరారు. ఇలాంటి పోస్టులు తన పరువుకు భంగం కలిగించడంతో పాటు వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఆమె తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు.



