మిగిలిపోయిన ఫుడ్‌తోనే టేస్టీ వంటలు..

ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయిందా? కూరగాయలు కొద్దిగానే ఉన్నాయా? వాటిని పారేయకుండా టేస్టీ వంటలు చేసుకోవచ్చు. ఇటలీలో ఈ పద్ధతిని ‘కూచినా పోవెరా’ అంటారు. అంటే ఇంట్లో ఉన్న పదార్థాలతోనే తక్కువ ఖర్చులో వంట చేయడం. పాత బ్రెడ్‌తో సూప్‌లు, సలాడ్లు.. బీన్స్, కూరగాయలతో రకరకాల వంటలు చేస్తారు. గతంలో డబ్బులు, ఆహారం తక్కువగా ఉన్నప్పుడు మొదలైన ఈ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది. ఫుడ్‌ను వేస్ట్ చేయకుండా వాడుకోవడమే దీని మెయిన్ ఐడియా.



