రవితేజ కొత్త సినిమా ‘తులాభారం’ స్టార్ట్

రవితేజ, ‘సరిపోదా శనివారం’ ఫేమ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న కొత్త సినిమా ‘తులాభారం’ గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. హైదరాబాద్‌లో ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఫస్ట్ క్లాప్‌తో సినిమాను లాంచ్ చేశారు. ఈ మూవీలో ప్రియాంక మోహన్, అనస్వర రాజన్ హీరోయిన్లుగా నటించనున్నారు. జేడీ చక్రవర్తి, తరుణ్ భాస్కర్ కీ రోల్స్‌లో కనిపించనున్నారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ క్రైమ్ ఎంటర్‌టైనర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది.



