సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ మళ్ళీ వార్నింగ్?

బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో మరోసారి బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్, బిష్ణోయ్ సమాజానికి క్షమాపణలు చెప్పకపోతే సల్మాన్ ఖాన్ ఫ్యామిలీలో కుక్కను కూడా వదిలిపెట్టబోమని ఓ ఆడియోలో హెచ్చరించారు. ఈ ఆడియో నిజమా కాదా అని ముంబై పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. ఈ ఘటనతో సల్మాన్ ఇంటి వద్ద భద్రత పెంచారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని మహారాష్ట్ర CM ఫడ్నవీస్ తెలిపారు.


