నేటి నుంచి దసరా నవరాత్రులు

AP: విజయవాడ ఇంద్రకీలాద్రి విద్యుద్దీపాల వెలుగుల్లో మెరిసిపోతోంది. ఇవాళ నుంచి దుర్గమ్మ శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు అమ్మవారు బాలాత్రిపురసుందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఏడాది 25 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని గమనించేందుకు AI కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 13న తమిళనాడు సీఎం విజయ్, 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. 16న సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.



