బ్లీజర్ ట్రావెల్ ట్రెండ్

ఆఫీస్ పని కోసం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ కొంత వ్యక్తిగత సమయాన్ని గడపడం ఇప్పుడు ‘బ్లీజర్ ట్రావెల్’గా మారుతోంది. బిజినెస్ ట్రిప్‌కు ముందు లేదా పని పూర్తయ్యాక కొన్ని రోజులు అక్కడే ఉండి కొత్త ప్రదేశాలు చూడటం, స్థానిక ఫుడ్ తినడం, షాపింగ్, ఫొటోలు, రీల్స్ చేసుకోవడం చేస్తున్నారు. కొందరు కుటుంబ సభ్యులను కూడా వెంట తీసుకెళ్తున్నారు. రిమోట్, హైబ్రిడ్ వర్క్ పెరగడంతో ఈ విధమైన ప్రయాణాలకు ఆసక్తి పెరుగుతోంది. భారత్‌లోనూ బిజినెస్ ట్రావెల్‌లో ఈ ట్రెండ్ కనిపిస్తోంది.
