← Back to news

BJP, RSSకి నేహా బోరా వార్నింగ్!

By Sahani· 7 Oct 2026· X

ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే శక్తులకు వ్యతిరేకంగా తామంతా ఏకమై పోరాడతామని CEC జ్ఞానేశ్ కుమార్‌ని ఉద్దేశించి నేహా బోరా వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్యం అనేది ఎప్పటికీ BJP, RSSల జాగీరు కాదనీ, అది దేశ ప్రజల సొత్తని ఆమె అన్నారు. అక్టోబర్ 10న జంతర్ మంతర్ దగ్గర జరిగే ప్రొటెస్ట్, కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిదని గళమెత్తారు. వీధుల్లోంచి వస్తున్న ప్రజల ఆక్రోశాన్నీ, గొంతునూ పాలకులు వినాలనీ, జవాబుదారీతనం కలిగి ఉండాలని డిమాండ్ చేశారు.

More in Current Affairs