‘మై ఫాదర్ బాలయ్య’ పుస్తక రచయిత కన్నుమూత

‘మై ఫాదర్ బాలయ్య’ పుస్తక రచయిత వైబీ సత్యనారాయణ 82 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగపల్లి ఆయన స్వస్థలం. ఆయన రచించిన ఈ పుస్తకం నిజాం కాలం నాటి తెలంగాణ గ్రామీణ జీవితం, దళితుల పరిస్థితులు, సామాజిక అసమానతలను వివరిస్తుంది. ‘కబాలి’ సినిమాలో రజనీకాంత్ ఈ పుస్తకాన్ని చదువుతున్నట్లు చూపించడంతో మరింత గుర్తింపు పొందింది.


