కృష్ణా నదిలో దాగిన చరిత్ర..వీడియో వైరల్
TG:నాగర్కర్నూల్ జిల్లా సోమశిల దగ్గరలోని చారిత్రక సంగమేశ్వర గుడి బయటకు వచ్చింది. సాధారణంగా వేసవిలో మాత్రమే కనిపించే ఈ ఆలయం కృష్ణా నదిలో నీటి మట్టం తగ్గడంతో ఈ ఏడాది ముందుగానే దర్శనమిస్తోంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఇంత త్వరగా ఆలయం బయటకు రావడం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయం ఏడాదిలో సుమారు 8 నెలలు కృష్ణా నదిలో నీట మునిగి ఉంటుంది. మిగిలిన 4 నెలలు భక్తులకు కనిపిస్తుంది. నీటిలో ఉన్న గుడి చరిత్ర వల్ల ఈ వీడియో వైరల్ అయింది.

