డెమోక్రటిక్ అసోసియేషన్ కన్వీనర్‌గా కిరణ్..!

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలి గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ వెటర్నరీ అసిస్టెంట్. ఆయనను డెమోక్రటిక్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. ఈ నెల 13న విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు జి. జోసెఫ్ కిషోర్ ఈ విషయం తెలిపారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తానని కిరణ్ అన్నారు. పలువురు సచివాలయ ఉద్యోగులు, సంఘ నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.



