దసరా ముందు షాక్.. ధరలు పెరగనున్నాయ్

దసరాకు కొత్త TV లేదా AC కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే బడ్జెట్ పెంచాల్సిందే! అక్టోబర్ 1 నుంచి ACల ప్రైస్ 5 నుంచి 8%.. LED TVలు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్‌ల రేట్లు 3 నుంచి 4% పెరగనున్నాయి. క్రూడ్, కాపర్, స్టీల్ రా మెటీరియల్స్ రేట్లు పెరగడమే రీజన్. అయితే డీలర్ల దగ్గర పాత స్టాక్ ఉండటంతో మరో నెల వరకు హైక్ ఎఫెక్ట్ పెద్దగా కనిపించకపోవచ్చని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. UPI ఛార్జీలు పెరిగితే.. ఆ బర్డెన్ కూడా కస్టమర్ల జేబుపైనే పడొచ్చు.