అరకులో నవరాత్రి ఉత్సవాలు
అరకు రైల్వే స్టేషన్ రైల్వే కాలనీలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు గ్రాండ్గా జరుగుతున్నాయి. 8వ రోజు ఆదివారం అమ్మవారు మహాగౌరీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా సాయంత్రం నిర్వహించిన లక్ష కుంకుమార్చన పూజలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. అమ్మవారి నామస్మరణలు, ప్రార్థనలతో రైల్వే కాలనీ ఏరియా అంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది.



