"సింగీతం"కి కమల్ హాసన్ అంజలి
చెన్నైలో కన్నుమూసిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకి నటుడు కమల్ హాసన్ అంజలి సమర్పించారు. రాజా పార్వై, పుష్పక విమానం, అపూర్వ సహోదరులు, మైఖేల్ మదన కామరాజన్ వంటి సినిమాల్లో ఈ ఇద్దరూ కలిసి పనిచేశారు. నివాళులు అర్పిస్తూ కమల్ హాసన్.. “సినిమాను ఒక్క వ్యక్తి కృషిగా చూడలేం. ఇది పెద్ద కొండలా ఉంటుంది. మనం ఆ కొండపై పేర్లు రాసుకునే పర్యాటకులం. కానీ ఆయనకు అందులో శిల్పకళా స్థానం ఉంది. ఆయనతో పనిచేసినందుకు సంతోషం” అని అన్నారు.



