← Back to news

మురికి కాలువల్లో నిమజ్జనం!

By Gaini· 20 Sept 2026

వినాయక నిమజ్జనం పేరుతో విగ్రహాలను మురికి కాలువలు, చెత్తలో పడేయడంపై ఓ యువకుడు తీవ్రంగా స్పందించాడు. సరైన రీతిలో నిమజ్జనం చేయలేనప్పుడు అసలు విగ్రహాలను పెట్టకపోవడమే మంచిదని మండిపడ్డాడు. మురికి నీటిలో తేలుతున్న గణేషుడి విగ్రహాలను తనే స్వయంగా బయటకు తీస్తూ, మనం దేవుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించాడు. విగ్రహాలను ఇలా కాలుష్యంలో కలపడం ఆపాలని కోరాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More in Viral