← Back to news

నకిలీ ప్లేట్లతో 88 బైక్‌లు, 12 కార్లు సీజ్

By Lokesh· 5h ago
నకిలీ ప్లేట్లతో 88 బైక్‌లు, 12 కార్లు సీజ్

TG: హైదరాబాద్‌లో నకిలీ నంబర్ ప్లేట్లు వాడుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. గత 8 నెలల్లో ఇలాంటి ప్లేట్లు వాడిన 100 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, 88 బైక్‌లు, 12 కార్లను సీజ్ చేశారు. నంబర్ ప్లేట్లను మార్చడం లేదా నకిలీ ప్లేట్లు వాడటం చట్టవిరుద్ధమని పోలీసులు తెలిపారు. వాహనదారులు HSRP నిబంధనలు పాటించాలని, నంబర్ ప్లేట్లలో మార్పులు చేయవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పైల్ చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

More in TG