ప్రశ్న రావణ్ రిమాండ్‌పై ప్రకాష్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్!
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్, రిమాండ్‌పై యాక్టర్ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. "నాలుగు సార్లు అరెస్టు చేసి, నాలుగు సార్లు బెయిల్ వస్తే.. ఇప్పుడు UAPA చట్టాన్ని వాడుతూ రిమాండ్‌కు పంపుతారా?" అని ప్రశ్నించారు. "మీరు ఆట మొదలు పెట్టారు, ప్రజలు దాన్ని క్లోజ్ చేస్తారు" అంటూ ఫైర్ అయ్యారు. నెక్స్ట్ మార్ఫింగ్ వీడియోలతో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా అంటూ జనసైనికులపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.



