తండ్రి పేరు లేకపోయినా.. హక్కులు ఉంటాయి

తండ్రి పేరు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న పిల్లలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ ప్రయోజనాలు ఆపకూడదని AP బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఉండవల్లి గాంధీబాబు అన్నారు. బర్త్ సర్టిఫికెట్, స్కూల్ రికార్డులు, ఐడెంటిటీ కార్డుల కోసం తండ్రి వివరాలు అడగడం వల్ల కొందరు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పిల్లల హక్కులకు అడ్డంకులు లేకుండా దేశవ్యాప్తంగా ఒకే విధమైన స్పష్టమైన నిబంధనలు తీసుకురావాలని అన్నారు.



