← Back to news

'రజక యువతతోనే సమాజ అభివృద్ధి సాధ్యం'

By ప్రశాంత్· 1h ago· Siddipet
'రజక యువతతోనే సమాజ అభివృద్ధి సాధ్యం'

రజక సమాజాన్ని ఐక్యంగా ముందుకు నడిపిస్తూ, హక్కుల సాధనకు కృషి చేయడమే తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి లక్ష్యమని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ గణేష్ చిన్నరంగారి తెలిపారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండల యూత్ అధ్యక్షుడిగా పిడిచెట్టి గౌరీషను నియమించారు. జిల్లా అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ దీటి రాజు కమిటీ వివరాలు వెల్లడించారు. యువత ఐక్యంగా రజకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

More in Local