‘చుట్టమల్లే’ మార్ఫింగ్‌పై జాన్వీ కపూర్ ఫైర్!

జాన్వీ కపూర్ ‘చుట్టమల్లే’ సాంగ్‌ను AIతో వల్గర్‌గా మార్ఫింగ్ చేయడంపై స్పందించారు. మహిళలను కించపరిచేలా కంటెంట్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేయడం షేమ్‌ఫుల్ అని ఫైర్ అయ్యారు. ఇది దాదాపు లైంగిక దాడితో సమానమని అన్నారు. మహిళ బట్టలు, తన బాడీపై నిర్ణయాలు పూర్తిగా ఆమెకే చెందుతాయని, ఆమె ‘నో’ చెబితే దాన్ని గౌరవించాలని చెప్పారు. టెక్నాలజీని మహిళలను వస్తువుల్లా చూపించేందుకు వాడొద్దన్నారు. తనకు సపోర్ట్ చేసిన NTR, చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఖుష్బూకు థాంక్స్ చెప్పారు.
