20-20-20 రూల్ తెలుసా? కళ్లకు ఇది బిగ్ రిలీఫ్!

ల్యాప్‌టాప్, కంప్యూటర్ను గంటల తరబడి చూస్తున్నారా? అయితే కళ్ల నొప్పి, డ్రైనెస్, తలనొప్పి రావచ్చని కంటి నిపుణులు చెబుతున్నారు. అందుకే 20-20-20 రూల్ ఫాలో అవ్వండి.. ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్లు చూడండి. స్క్రీన్‌ను సరైన దూరంలో ఉంచండి. బ్రైట్నెస్ సెట్ చేసుకోండి. తరచూ బ్లింక్ చేయండి. గంటకోసారి 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. కళ్లను నిర్లక్ష్యం చేయొద్దు.. మీ ఐస్‌కు కూడా కేర్ అవసరం.



