ధర్మపురిలో జాతీయ కమిషన్ సభ్యుడు
TG జగిత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ జాటోత్ ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, తహశీల్దార్ శ్రీనివాస్, సీఐ రాంనర్సింహ రెడ్డి, వేద పండితులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.



