కలలు కనండి.. వాటిని నిజం చేసుకోండి: అబ్దుల్ కలాం

భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ A.P.J. అబ్దుల్ కలాం జయంతి నేడు (అక్టోబర్ 15). 1931లో తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించిన ఆయన, భారత అంతరిక్ష, క్షిపణి రంగాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. 2002 నుంచి 2007 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు. విద్యార్థులు పెద్ద కలలు కని, వాటిని సాధించేందుకు కష్టపడాలని ప్రోత్సహించారు. సాధారణ కుటుంబం నుంచి దేశ అత్యున్నత పదవికి ఎదిగిన ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం.



