← Back to news

గ్రామస్తులను టెన్షన్ పెట్టిన మందు బాబు!

By sahani· 25 Jun 2026· X· Uttar pradesh
గ్రామస్తులను టెన్షన్ పెట్టిన మందు బాబు!

ఉత్తరప్రదేశ్ మహారాజ్‌గంజ్ జిల్లా పర్సాఖుర్ధా గ్రామంలో ఒక రేంజ్ హై-డ్రామా జరిగింది. దీనదయాళ్ అనే వ్యక్తి ఫుల్‌గా తాగేసి, ఏకంగా 11,000 వోల్టుల కరెంట్ స్తంభం ఎక్కి వైర్లపై ఉయ్యాల ఊగాడు. దీంతో టెన్షన్ పడ్డ గ్రామస్తులు బీతౌలి పోలీసులకు, విద్యుత్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పవర్ సప్లై ఆపించారు. గంటల కొద్దీ కష్టపడి అతన్ని కిందకి దించారు. షాకింగ్ ఏంటంటే.. అతను స్తంభం ఎక్కడానికి జస్ట్ కొన్ని నిమిషాల ముందే పవర్ కట్ అవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

More in Viral

రొనాల్డో సిస్టర్ కేరళంలో సందడి.. CMతో ఫొటో వైరల్!
Viral· 2d ago

రొనాల్డో సిస్టర్ కేరళంలో సందడి.. CMతో ఫొటో వైరల్!

ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో కేరళంలో సందడి చేశారు. కోజికోడ్‌లో ఓ జ్యువెల్లరీ ఈవెంట్‌కు వచ్చిన ఆమె.. ఆ తర్వాత కేరళం CM వి.డి. సతీశన్‌ను కలిశారు. ఇక్కడ రొనాల్డోకు భారీ ఫ్యాన్ బేస్ ఉందని CM చెప్పగా, ఈ విషయం తనకు తెలియదని ఎల్మా అన్నారు. ఈ విషయాన్ని రొనాల్డోతో చెబుతానని చెప్పారు. చివర్లో ‘CM సార్.. ఒక్క ఫొటో ప్లీజ్’ అంటూ ఫొటో అడగడంతో ఈ మూమెంట్ వైరల్‌గా మారింది. తరువాత CMతో దిగిన ఫొటోలను ఎల్మా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. <a href="https://x.com/vdsatheesan/status/2095026237718806895?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2095026237718806895%7Ctwgr%5E0150c68c6d23d9ff94230cf5dcecf2cd9b6551b7%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Fcristiano-ronaldos-sister-elma-visits-kerala-smr-1554789.html">వీడియో లింక్</a>

రైల్లో ఇండియన్స్ హంగామా.. టూరిస్టులపై కామెంట్స్!
Viral· 3d ago

రైల్లో ఇండియన్స్ హంగామా.. టూరిస్టులపై కామెంట్స్!

జర్మనీలో ఫుల్ రష్‌గా ఉన్న ఓ రైల్లో కొందరు గుజరాతి ఇండియన్ టూరిస్టులు గట్టిగా పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ హంగామా చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యూజర్ ఈ వీడియోను <a href="https://x.com/Amit24TD/status/2094429195527196793?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2094429195527196793%7Ctwgr%5Ea95b9a92608886003674bc8a8ac30d78b1151367%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fprathyekam%2Fgermany-train-viral-video-indian-tourists-singing-clapping-sparks-outrage-bsb-1554431.html">'ఎక్స్‌'లో</a> పోస్ట్ చేశారు. రైల్లోని ఇతర టూరిస్టులను సైలెంట్‌గా ఉండగా.. ఇండియన్స్ చేసిన హంగామాపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. విదేశాల్లో ఇలాంటి వారి బిహేవియర్‌తో ఇండియన్ టూరిస్టులపై నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుందని కామెంట్లు చేస్తున్నారు.