EV కొంటే ఇన్సూరెన్స్ ఖర్చెంత?

ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కారు ధర, ఛార్జింగ్ ఖర్చులే కాదు.. ఇన్సూరెన్స్ గురించి కూడా తెలుసుకోవాలి. పెట్రోల్ కార్లతో పోలిస్తే EVల ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే వీటిలో బ్యాటరీ చాలా ఖరీదైనది. యాక్సిడెంట్‌లో బ్యాటరీ దెబ్బతింటే రిపేర్ ఖర్చు భారీగా ఉండొచ్చు. అందుకే పాలసీ తీసుకునే ముందు బ్యాటరీ కవర్, ఛార్జర్ ప్రొటెక్షన్, క్లెయిమ్ రూల్స్ చెక్ చేయాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. వేర్వేరు కంపెనీల ప్రీమియంలు, కవరేజ్ పోల్చి చూసి మీకు సరిపోయే పాలసీని ఎంచుకోండి.



