యువత పిడికిలి బిగిస్తే పాలకుల పీఠాలు కదులుతాయి
TG: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సులో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైరయ్యారు. యువత కోసం BRS పోరాటం చేస్తుందన్నారు. యువశక్తి కదిలితే పాలకుల పీఠాలు కదిలిపోతాయని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో యువత కీలక పాత్ర పోషించిందని గుర్తుచేసిన ఆయన, రేపటి తెలంగాణ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన వారిని నిలదీయడానికే ఈ సదస్సు నిర్వహించామన్నారు. హామీలు అమలుచేయకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.



