← Back to news

హ్యూమనాయిడ్ రోబోల తయారీలో చైనా రికార్డ్

By DS· 25 Jun 2026· Beijing
హ్యూమనాయిడ్ రోబోల తయారీలో చైనా రికార్డ్

ప్రపంచవ్యాప్తంగా హ్యూమనాయిడ్ రోబోల (మానవరూప రోబోలు) తయారీలో చైనా తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. గ్లోబల్ మార్కెట్‌లో దాదాపు 85% రోబోలను చైనా కంపెనీలే ఉత్పత్తి చేస్తున్నాయి. తక్కువ ధర, పటిష్టమైన సప్లై చైన్ ,ప్రభుత్వ భారీ పెట్టుబడుల మద్దతుతో అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలను వెనక్కి నెట్టి చైనా ఈ రంగంలో స్పష్టమైన లీడ్‌ను దక్కించుకుంది. రాబోయే రోజుల్లో గృహ అవసరాలు, పారిశ్రామిక రంగాల్లో వీటిని భారీగా వాడాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.

More in Technology