బైక్ పట్టుకున్న ప్రియురాలిని లాక్కెళ్లి...
ఐదేళ్ల ప్రేమ తర్వాత "ఇక పెళ్లి చేసుకుందాం" అని అడిగిందట ఆ అమ్మాయి. కానీ ఆ ఒక్క మాటతో మొదలైన గొడవ.. చివరికి రోడ్డుపైనే వైరల్ వీడియోగా మారింది. బీహార్‌లోని రాజ్‌గిర్లో బైక్‌పై వెళ్లిపోతున్న అబ్బాయిని ఆపేందుకు ఆమె బైక్‌ను పట్టుకుందని.. అయినా అతను ఆపకుండా ముందుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అమ్మాయిని దాదాపు 100 మీటర్ల వరకు రోడ్డుపై ఈడ్చుకెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. చివరికి బైక్ బ్యాలెన్స్ తప్పడంతో ఇద్దరూ కిందపడిపోయారు. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని యువకుడిని అడ్డుకున్నారు.



