CJP యాక్టివిస్టులపై పోలీసుల ప్రెజర్.. అడ్డుకుంటే తగ్గేదేలే!

CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద CJP చేపడుతున్న నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై స్పందించిన CJP సౌరవ్ దాస్, నిరసన తెలపడానికి పోలీసుల పర్మిషన్ అవసరం లేదని, కేవలం సమాచారం అందించడానికే పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో నోటీసు ఇచ్చామని అన్నారు. జంతర్ మంతర్ ప్రశాంత నిరసనలకు కేటాయించిన స్థలమని, అక్కడ శాంతిభద్రతలను పర్యవేక్షించడమే పోలీసుల బాధ్యత అని ఆయన అన్నారు.



