సింగరేణి గనిలో జనసేన దసరా ఉత్సవాలు

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని గోదావరిఖని సింగరేణి 11 ఇంక్లైన్ మైన్‌లో అమ్మవారి పూజా కార్యక్రమం జరిగింది. జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ పాల్గొని సింగరేణి కార్మికులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. యువజన విభాగం అడ్ హాక్ కమిటీ సభ్యుడు రావుల మధు, కోఆర్డినేటర్ డాక్టర్ రాజ్ కుమార్, తన్నీరు మధుకర్, రాజేంద్రప్రసాద్, రాజ్ కుమార్, రంజిత్, అశ్విత్, బషీరుద్దీన్, తిరుపతి, లోకేష్ పాల్గొన్నారు.




