గురక గాఢనిద్ర కాదు..

‘గురక పెడుతున్నారంటే గాఢంగా నిద్రపోతున్నట్లే’ అనుకుంటే పొరపాటే! అది 'స్లీప్ ఆప్నియా' (శ్వాస పూర్తిగా 10 సెకన్ల నుంచి ఒక నిమిషం వరకు ఆగిపోవచ్చు) అనే తీవ్రమైన నిద్ర సంబంధిత వ్యాధికి సంకేతం కావచ్చు. మన దేశంలో లక్షలాది మందికి ఈ వ్యాధి ఉందనే విషయమే తెలియదు. చికిత్స తీసుకోకపోతే గుండె జబ్బులు, బిపి, స్ట్రోక్, మధుమేహం, డిప్రెషన్, ఆకస్మిక మరణం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్‌లు తెలిపారు. కుటుంబ సభ్యులే ఈ లక్షణాలను మొదట గుర్తించగలరు. కాబట్టి అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు.



