రిలీజ్‌కు ముందు చూడాల్సిందే..

నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న 'రామాయణ' సినిమాను ఢిల్లీకి చెందిన శ్రీ రామలీలా మహాసంఘ్ సంస్థ, రిలీజ్ కి ముందే తమకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేసి చూపించాలని డిమాండ్ చేస్తుంది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకే ఈ విజ్ఞప్తి అని చెబుతుంది. అయితే దీనిపై సినీ ప్రముఖుల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. సినిమాలో ఏం ఉండాలో, ఏం తీసేయాలో నిర్ణయించే హక్కు కేవలం సెన్సార్ బోర్డు (CBFC)కి మాత్రమే ఉందని అంటున్నారు.



