కూకట్‌పల్లిలో 50 కిలోల స్పాయిల్డ్ మాంసం సీజ్
TG: హైదరాబాద్ కూకట్‌పల్లిలోని భూలక్ష్మి మెస్‌లో 50 కిలోల స్పాయిల్డ్ మాంసం బయటపడింది. తెలంగాణ సేఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్స్ రెస్టారెంట్లు, హోటళ్లు, ఢాబాల్లో స్పెషల్ ఇన్‌స్పెక్షన్ చేశారు. ఇందులో భాగంగా భూలక్ష్మి మెస్‌లో 30 కిలోల పాత మటన్, 20 కిలోల చెడిపోయిన చికెన్ గుర్తించారు. వీటిని అధికారులు సీజ్ చేసి డిస్పోజ్ చేశారు. హైదరాబాద్‌లో క్వాలిటీ లేని, సేఫ్ కాని ఆహారంపై స్పెషల్ చెకింగ్ కంటిన్యూ అవుతున్నాయి.


