← Back to news

ప్రాణాలే పోయేలా చేసిన రీల్స్ పిచ్చి!

By Sahani· 9 Sept 2026· Andhrajyothy· Chhattisgarh
ప్రాణాలే పోయేలా చేసిన రీల్స్ పిచ్చి!

ఛత్తీస్‌గఢ్‌ కోర్బా జిల్లా కేరాకచ్చర్‌ గ్రామానికి చెందిన 52 ఏళ్ల మంగ్లో బాయ్‌ సారథి ఎప్పుడూ ఫోన్‌ చూస్తూ రీల్స్‌ కి అడిక్ట్ అయింది. శనివారం ఇంట్లో రీల్స్‌ చూస్తుండగా ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ సరిగ్గా రాక వీడియోలు పదేపదే ఆగిపోవడంతో బాగా విసిగిపోయింది. ఆవేశంలో తన ఫోన్‌ను నేలకేసి పగలగొట్టి, ఆపై ఇంట్లోని పురుగుల మందు తాగేసింది. కుటుంబసభ్యులు వెంటనే కోర్బా మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా, అక్కడ ట్రీట్‌మెంట్ పొందుతూ సోమవారం ఆమె చనిపోయినట్లు పోలీసులు కన్‌ఫర్మ్ చేశారు.

More in Technology