← Back to news

పాలమూరులో బ్రహ్మోస్‌ మిస్సైల్‌ తయారీ యూనిట్‌

By డీకే· 23 Jun 2026· Andhrajyothy· మహబూబ్‌నగర్ జిల్లా
పాలమూరులో బ్రహ్మోస్‌ మిస్సైల్‌ తయారీ యూనిట్‌

అత్యాధునిక బ్రహ్మోస్‌ క్షిపణులను తయారుచేసే యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’, ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ పథకాల్లో భాగంగా బ్రహ్మోస్‌ మిస్సైల్‌ తయారీ 2వ యూనిట్‌ను మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనిట్‌ ఏర్పాటు నిమిత్తం సర్వే నిర్వహించిన బ్రహ్మోస్‌ బృందం.. ఆ ప్రాంతం అన్నివిధాలా అనుకూలంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేసింది. రక్షణశాఖ లఖ్‌నవూ (UP)లో మొదటి యూనిట్‌ ఏర్పాటు చేయగా మహబూబ్‌నగర్‌లో రెండో యూనిట్.

More in India