వందే భారత్ స్లీపర్ పైకంటెంట్ క్రియేటర్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్ పీరియన్స

వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణించిన ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ రుచి త్రివేది అనుభవం ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ కొత్త జనరేషన్ రైలు లుక్, డిజైన్ మైండ్ బ్లోయింగ్ అంటూ ఆమె తెగ పొగిడేసింది. ముఖ్యంగా సెకండ్ ఏసీ కోచ్‌లోని మోడ్రన్ కర్టెన్లు, లైటింగ్, నీట్ బెడ్డింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉన్నాయని మెచ్చుకుంది. ప్రభుత్వం ఇంత సూపర్ ట్రైన్ ఇచ్చింది కాబట్టి, దీన్ని క్లీన్‌గా ఉంచడం మన బాధ్యత అంటూ సివిక్ సెన్స్ గురించి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.కామాఖ్య- హౌరా వందే భారత్ స్లీపర్ సర్వీస్ లో ఆమె ప్రయాణించారు.



