దేశానికే ఆదర్శంగా AP హెల్త్ మోడల్ : చంద్రబాబు

ఆరోగ్య సేవల్లో భారీ మార్పులకు AP ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1నుంచి ‘సంజీవని’ ప్రాజెక్టును అమలు చేయాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు ఆఫీస్‌లో నిర్వహించిన సమీక్షలో ప్రాజెక్టు విస్తరణకు రూపొందించిన 90రోజుల కార్యాచరణను అధికారులు CMకు వివరించారు. కుప్పం, చిత్తూరులో సంజీవని ద్వారా మంచి ఫలితాలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని నిర్ణయించారు. AI ఆధారిత వైద్యసేవలు, డిజిటల్ హెల్త్ రికార్డులు, వ్యాధుల ముందస్తు గుర్తింపునకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.



