50 పైసల కాయిన్‌కి ఇంకా వాల్యూ ఉందా?

మీ దగ్గర 50 పైసల కాయిన్లు ఉన్నాయా? వాటిని పనికిరావని పక్కన పడేయకండి. 50 పైసల కాయిన్ ఇంకా చెల్లుతూనే ఉంది. ఆర్‌బీఐ ప్రకారం ఇది ఇప్పటికీ లీగల్ టెండర్. మీ దగ్గర ఇలాంటి కాయిన్లు ఎక్కువగా ఉంటే బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకోవచ్చు. కావాలంటే అక్కడే మార్చుకోవచ్చు. షాపుల్లో కూడా పేమెంట్‌కు వాడొచ్చు. అయితే ఒక్క పేమెంట్‌లో 10 రూపాయల వరకు 50 పైసల కాయిన్లతో చెల్లింపు చేయొచ్చు. కాబట్టి ఇంట్లో ఉన్న పాత కాయిన్లను పనికిరావని అనుకోకండి.



