రోడ్లపై వేసే నల్లటి తారు ఎలా తయారవుతుందో తెలుసా?

తారు తయారీలో భూమి నుంచి తీసే క్రూడ్ ఆయిల్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. రిఫైనరీల్లో క్రూడ్ ఆయిల్‌ను హై టెంపరేచర్లో ప్రాసెస్ చేసినప్పుడు పెట్రోల్, డీజిల్ వంటి ఫ్యూయల్స్ వేరు అవుతాయి. చివరగా మిగిలే చిక్కటి నల్లటి పదార్థాన్ని బిటుమెన్ అంటారు. దీన్ని వేడి చేసిన కంకర రాళ్లు, ఇసుకతో కలిపి రోడ్లపై పరుస్తారు. ఆ తర్వాత భారీ రోలర్లతో గట్టిగా తొక్కుతారు. ఇలా రాళ్లను బలంగా అతికించే బిటుమెన్ సాయంతో వెహికల్స్ బరువును తట్టుకునే తారు రోడ్లు రెడీ అవుతాయి.



