← Back to news

OUలో పోరుదీక్ష.. విద్యార్థి నేత అరెస్ట్

By DK· 14 Jul 2026· హైదరాబాద్
OUలో పోరుదీక్ష.. విద్యార్థి నేత అరెస్ట్

TG: రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలని చేయాలని విద్యార్థిసేన ఆధ్వర్యంలో OUలో నిరుద్యోగ పోరుదీక్ష చేశారు. యూనివర్సిటీలో దీక్షకు అనుమతి లేదని విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు శివప్రసాద్‌ను OU పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన CM రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని ఫైరయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్‌లను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు.

More in Jobs